మీ స్టార్ట‌ప్‌ను గెలిపించే బ‌ల‌మైన పుస్త‌కం ఇదిగో!

Standard

మీ స్టార్ట‌ప్ ఆలోచ‌న‌ల‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో పాటు, వంద‌లాది అంశాల‌పై మీకు స‌మ‌గ్ర‌మైన స‌మాచారాన్ని అందించే స్టార్ట‌ప్ మేనేజ్‌మెంట్ పుస్త‌కం ఇప్పుడు తెలుగులో కూడా విడుద‌లైంది. ఇంగ్లీష్‌లో ల‌క్ష‌లాదిమంది స్టార్ట‌ప్ ఔత్సాహికుల‌కు అత్యంత విలువైన స‌మాచారాన్ని అందించిన స్టార్ట‌ప్ మేనేజ్‌మెంట్ పుస్త‌కం తెలుగు ఎడిష‌న్‌ను కూడా విఎమ్ఆర్‌జి ప్ర‌చురించింది.

startup-telugu-coverఈరోజు స్టార్టప్‌ ఒక అందమైన కల. సొంత శక్తి సామర్థ్యాలను పెట్టుబడిగా పెట్టి, తమకు నచ్చిన రీతిలో బతకడానికి స్టార్టప్‌లు అవకాశం కల్పిస్తాయనే ఆశలు ఈరోజు కొత్తతరం యువతీయువకుల్లో బాగా కనిపిస్తున్నాయి. అందుకు ప్రోత్సహిం చేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వారికి అందుబాటులోకి వస్తోంది. విశ్వవ్యాప్తంగా ఎదిగే అవకాశాలు పెరుగుతున్నాయి. దీంతో సొంత వ్యాపారాల సంఖ్య గతంలో కంటే ఈరోజు అనేక రెట్లు పెరిగింది. చదువులు పూర్తిచేసుకుని కెరియర్‌ ప్రపంచం లోకి అడుగుపెడుతున్నవారిలో ఎక్కువమంది సొంతవ్యాపారాల వైపే మొగ్గు చూపే స్థాయికి చేరింది.

అయితే, ఈ స్టార్టప్‌ కలల్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇవన్నీ కలలేనా? లేక నిజంగానే ఉపయోగపడేవా? ఎలా తేల్చుకోవాలి? స్టార్టప్‌ల మాయలో పడొద్దని ప్రపంచవ్యాప్తంగా నిపుణులు చేస్తున్న సూచనలను ఎలా అర్థం చేసుకోవాలి? ఒకవైపు వందలాదిగా స్టార్టప్‌లు మూతపడుతుంటే, మరోవైపు వేలాదిగా ఎలా పుట్టుకొస్తున్నాయి? ఇందుకు కారణం ఎంట్రప్రెన్యూర్ల అవగాహనా లోపమా? లేక ఇంకేదైనానా? వీటివెనుక వున్న వాస్తవాలను ఎలా పట్టుకోవడం?

ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు దొరికితే స్టార్టప్‌ల ఏర్పాటు చాలా సులభతరమవుతుంది. అయితే, ఈ సమాధానాలు అందరికీ ఒకేలా వుంటాయా? ఒకే జవాబు లక్షలాదిమందికి ఒకే పద్ధతిలో ఎలా వర్తిస్తుంది? ఎవరి ఆలోచనలు, సామర్థ్యాలు, ప్రణాళికలు, పెట్టుబడులు, అంచనాలు, ఆశలు వారికుంటాయి కదా! ఇదీ నిజమే! అంటే … ఎవరికి తగినట్లు వారు స్టార్టప్‌ అంచనాలను కస్టమైజ్‌ చేసుకోవాలని అర్థమవుతోంది కదా! ఈ కస్టమైజేషన్‌ ఎలా సాధ్యమవుతుంది? సరే, మీకు తగినట్లుగానే కస్టమైజ్‌ చేసుకుని, అన్నివిధాలా ఆలోచించాకే స్టార్టప్‌ ప్రారంభించారనుకోండి. అది నిలదొక్కుకునే అవకాశాలు ఎంతవరకూ వుంటాయి?

“మీ స్టార్ట‌ప్‌ను ఇలా గెలిపించండి” అనే ఈ పుస్త‌కం స్టార్ట‌ప్ ఔత్సాహికుల వంద‌లాది ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలిస్తుంది. స్టార్టప్‌లను ప్రాథమికంగా అర్థం చేసుకోవాలంటే ముందు అనేక వాస్తవాలను మీకు తెలియ‌జేస్తుంది.

వ‌ర్క్‌ప్లేస్ మేనేజ్‌మెంట్ అంశాల నిపుణుడు సురేశ్ వెలుగూరి ఈ పుస్త‌కాన్ని మీముందుకు తీసుకువ‌చ్చారు. స్టార్ట‌ప్ మేనేజ్‌మెంట్ అంశాల‌పై తెలుగులో ఇదే మొట్ట‌మొద‌టి పుస్త‌కం.

……………………………………………………………………………………………………….

Title: మీ స్టార్ట‌ప్‌ను ఇలా గెలిపించండి. Author : Suresh Veluguri. 240 pages, 1/8 demy size, HQ Aember printing. Price: Rs. 300). Shipping charges: Rs. 35 (India).(Speed Post / Secured Parcel Service).
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s